ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ అంటే ఇదేనేమో.. కూలీకి దక్కిన కోట్ల రూపాయలు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 08:57 PM

మొన్నటి వరకు కూలీ పనికి వెళితే కానీ రోజు గడవని స్థితి నుంచి ఇప్పుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాదేశ్‌ కేరళ ఎర్నాకులంకు ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చాడు. చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటుంది.


బాదేశ్ ఎప్పటిలాగే కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్త్రీశక్తి లాటరీ వద్ద టికెట్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి ఆ టికెట్‌పై రూ.75 లక్షల లాటరీ తగిలింది. దీంతో మనోడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అంతకాదు అతడిలో భయం కూడా మొదలైంది. వెంటనే అతడు నేరుగా పోలీసులను ఆశ్రయించి.. తన ప్రైజ్‌ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు.


ఉపాధి కోసం కేరళ వెళితే ఇలా అనుకోకుండా లాటరీ తగలడంతో బాదేశ్ ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి రూ.75 లక్షలు లాటరీతో ఒక్కరోజులోనే లక్షాధికారి అయిపోయాడు. తన టికెటుకు లాటరీ తగిలిందన్న ఆనందం ఓవైపు ఉంటే.. ఆ టికెటును ఎవరైనా కాజేస్తారేమో అనే భయం ఇంకోవైపు వెంటాడుతోంది. అందుకే పోలీసుల దగ్గరకు వెళ్లాడు. ఈ లాటరీ డబ్బులు చేతికి అందితే తన సొంత ఊరికి వెళ్లిపోతానంటున్నాడు. అక్కడే వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com