పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 169వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ తన 169వ రోజు పాదయాత్రను పిప్పర శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర అగ్రహారపు గోపవరం, ముగ్గళ్ల క్రాస్, అర్ధవరం, వరదరాజపురం, వెలగపల్లి, గొల్లదిబ్బ, గణపవరం మీదుగా సరిపల్లి వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా గణపవరంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.