తూర్పు గోదావరి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపిని బంగాళాఖాతంలో కలపాలని ముద్రగడ పవన్‌కు లేఖ రాయడం దారుణమన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపామని తెలిపారు. 30 ఏళ్లలో కాపులకు న్యాయం చేసింది చంద్రబాబు ఒక్కరే అని చినరాజప్ప అన్నారు.