లక్నో : ఉన్నావ్ అత్యాచార నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెన్ గార్ కు యోగి సర్కార్ జడ్ క్యాటగరి భద్రతను తొలగించింది. ఉన్నావ్ జిల్లా బంగర్మావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కు వై క్యాటగరి భద్రతలో భాగంగా ఇంత వరకూ ఇద్దరు కమెండోలు, పోలీసులు సహా 11 మందితో భద్రత ఉండేది. అయితే యోగి సర్కార్ ఆ భద్రతను తొలగిస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.