ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఓటీతోనే యువతకు భవిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:51 AM

 గ్రేట్‌ లేక్స్‌ ఇంటర్నేషనల్‌ వర్శిటీ ప్రతినిధుల భేటీలో సీఎం


  జూలైలో శ్రీసిటీలో గ్రేట్‌ లేక్స్‌ క్యాంపస్‌ ప్రారంభం


  అమరావతి నుంచి సూర్య ప్రతినిధి: ప్రపంచంలో ప్రస్తుతం నాలుగో పారి శ్రామిక విప్లవం నడుస్తోందని, యువత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతిక పరి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలో గ్రేట్‌ లేక్స్‌ ఇంటర్నేషనల్‌ యూని వర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌ డాక్టర్‌ బాల.వి.బాలచంద్రన్‌, ప్రొ. ఛాన్సలర్‌ మోహన్‌ లఖంరాజు, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పరాగ్‌ దివాన్‌ తదితరులు ముఖ్య మంత్రితో భేటీ అయ్యారు. శ్రీసిటీలో గ్రేట్‌ లేక్స్‌ యూనివర్శిటీ క్యాంపస్‌ ఏర్పా టు ప్రగతిని వివరించారు. విశ్వవిద్యాలయ బ్రోచర్‌ను ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలకు నవ్యాంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం వచ్చిందని, ఆనాటి పరిస్థితులకు అనగుణంగా పట్టుదలతో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చానని గుర్తుచేశారు. సాయం్త్రం అయితే జనం బయట తిరిగేందుకు సైతం భయపడే మాదాపూర్‌ ప్రాంతంలో సైబరాబాద్‌ నిర్మించి విశ్వ శ్రేణి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో శాఖలు తెరిచేవిధంగా కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌, డెలాయిట్‌, ఒరకిల్‌, ఐబీఎం తదితర కంపెనీలు కార్యాలయాలు తెరిచాయని చెప్పారు. రాష్ర్టంలో, దేశ విదేశాల్లో తెలుగువారికి పది లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు ఐటీ రంగంలో వచ్చాయని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవ సమయమని, యువత బంగారు భవిష్యత్తును నిర్దేశించే గ్రేట్‌ లేక్స్‌ యూనివర్శిటీ లాంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.  ఇంటికో ఇంజనీర్‌ తయారు కావాలని, ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది తన ఆశయమని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రేట్‌ లేక్స్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌ డాక్టర్‌ బాల.వి. బాలచంద్రన్‌ మాట్లాడుతూ శ్రీసిటీలో ఈ ఏడాది జూలై నుంచి యూనివర్శిటీ క్యాంపస్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. విద్యార్ధులు పారిశ్రామికవేత్తలుగా మారటానికి, పరిశ్రమలపై ఆసక్తి పెంచుకోవటానికి గ్రేట్‌ లేక్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ తోడ్పడుతుందని వివరించారు.


    దేశంలో అగ్రశ్రేణి బిజినెస్‌ స్కూల్స్‌ ను ప్రారంభించటం తన ధ్యేయమన్నారు. తమ విశ్వవిద్యాలయంలో  బిజినెస్‌ అనలెటిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇ-కామర్స్‌, ఫిన్‌ టెక్‌లలో స్పెషలైజేషన్లు ఉన్నాయన్నారు. బిటెక్‌లో మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, ఇంటర్‌ నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటి), క్లౌడ్గ కంప్యూటింగ్‌ అండ్గ సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్లో స్పెషలైజేషన్లు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ యూనివర్శిటీలతో అవగాహన ఉందని వివరించారు. అంతర్జాతీయ దక్పథంతో హాంకాంగ్‌ యూనివర్శిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, ఐఐటీ షికాగో, సింగపూర్‌ నాన్‌ యాంగ్‌ యూనివర్శిటీలలో చదివే అవకాశాలు తమ యూనివర్శిటీ బహుళ విషయ విభాగాల ద్వారా  లభిస్తాయని చెప్పారు.  ఈ సమావేశంలో ఇంకా గ్రేట్‌ లేక్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ కార్తీక్‌ గోపాలన్‌, స్డూడెంట్స్‌ ఎంగేజిమెంట్‌ విభాగం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎన్‌. శ్రీనగేష్‌, సీఎంఓ సహాయ కార్యదర్శి  ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com