ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 వాహనంలోనే గర్భిణీ ప్రసవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 11:46 AM

మండల కేంద్రమైన బొండపల్లి సమీపంలో ఆదివారం ఉదయం 108 వాహనం లోనే గర్భిణీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి మండలంలోని గరుడబిల్లి గ్రామానికి చెందిన ఎం. ఆదిలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి సమాచారం అందించారు. దత్తిరాజేరు మండలం లోని పెదమానాపురం 108 వాహన సిబ్బంది వచ్చి ఆదిలక్ష్మిని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అవడంతో వాహనాన్ని పక్కనపెట్టి ప్రసవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలక్ష్మి రెండవ కాన్పు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ. ఎం. టి గౌరినాయుడు, పైలెట్ సత్యనారాయణలు సేవలందించారు. తల్లి బిడ్డను బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com