ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌ 2022: నేడు ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 12:26 PM

ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వరుసగా మూడు స్థానాలను ఆక్రమించుకున్నాయి. ప్లేఆఫ్‌లో స్థానం కోసం ప్రస్తుతం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ ఉంది. ఈ తరుణంలో శనివారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. ఇందులో ఢిల్లీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. లేకుంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.


ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే అది బెంగళూరు జట్టుకు కలిసి వస్తుంది. ఢిల్లీపై ముంబై గెలవాలని బెంగళూరు జట్టు ఆశలు పెట్టుకుంది. అలా అయితేనే బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశం దక్కుతుంది. ఈ ఐపీఎల్‌లో ముంబై పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి, పరువు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com