టోక్యో ఒలింపిక్స్ లో నిరాశపరిచిన బాక్సర్ సతీశ్ కుమార్

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 04:13 PM
 

ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి..క్రీడాకారుల్లో కొంతమంది నిరుత్సాహ పరుస్తున్నారు. మరికొంత మంది పతకాల సాధించే దిశగా…సాగుతున్నారు. తాజాగా..పతకం సాధిస్తాడని అనుకున్న బాక్సర్ సతీశ్ కుమార్ నిరాశపరిచారు. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ లో భారత బాక్సర్ సతీశ్..ఓటమి పాలయ్యారు. బాక్సింగ్ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జలొలివ్ చేతిలో పరాజయం చెందారు. సతీశ్ పై 5-0 తేడాతో జలొలివ్ గెలుపొందారు.