ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్నెముక సమస్య లక్షణాలు ఇవే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 05:18 PM

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో వెన్నెముక ఒకటి. దీనికి ఏ చిన్న గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపుతుంది. మన రోజువారీ పనులే మన వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే సంగతి చాలామందికి తెలీదు. ఆ పనులే నెమ్మది నెమ్మదిగా వెన్నును కుంగదీస్తాయి. బరువులు ఎత్తుడం, వ్యాయామాలు కూడా వెన్నుముకపై భారాన్ని పెంచేస్తాయి. మొబైల్ ఫోన్ వినియోగం వెన్నుముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎక్కువ సేపు తలను ఒకవైపే ఆన్చడం, మెడను పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడటం, అతిగా గేమ్స్ ఆడటం వంటివి వెన్నుకు భారమవుతుంది. మహిళలు ఎక్కువగా హైహీల్స్ ధరించి నడవడానికి ఇష్టపడతారు. అయితే, ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ సేపు హైహీల్స్‌పై నడిచేవారికి వెన్ను అమరిక అదుపు తప్పుతుంది. ఆఫీసులో ఎక్కువ సేపు కుర్చీలకు అతుక్కొనిపోయేవారికి కూడా వెన్నుముక సమస్య తప్పదు. నిద్రలో పడుకొనే భంగిమ కూడా సక్రమంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక అదుపు తప్పుతుంది. మీరు పడుకొనే భంగిమ సక్రమంగా లేకపోతే వెన్నుముకపై ఒత్తిడి పెరిగి మెడ నొప్పి వస్తుంది.


వెన్నెముక సమస్య లక్షణాలు:


-> నడిచేప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.


-> మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి.


-> కాళ్లు, భుజాలు కదిపేందుకు ఇబ్బందిపడతారు.


-> తిమ్మిర్లు ఏర్పడతాయి.


-> స్పృహ కోల్పోవడం, తలనొప్పి వస్తాయి.


-> మెడ వద్ద తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది.


పై లక్షణాలుంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం శ్రేయస్కరం. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అవోకాడో వంటివి వెన్నుకు మేలు చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com