ప్రపంచంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 63లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మూడు లక్షలకుపైగా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఆరోగ్య సంస్థల నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 63,65,473లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 3,77,404 మంది మరణించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 29,03,413గా ఉంది.