స్పానిష్ ఫ్లూ నుండి బయటపడిన 108 ఏళ్ల బ్రిటిష్ మహిళ కరోనా వైరస్ కు గురైందని ఒక నివేదిక తెలిపింది. కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన కొన్ని గంటల తర్వాత హిల్డా చర్చిల్ శనివారం సాల్ఫోర్డ్ నర్సింగ్ హోమ్‌లో మరణించారని, తన 109 వ పుట్టినరోజుకు ఎనిమిది రోజుల ముందు ఆమె తుదిశ్వాస విడిచారని ది గార్డియన్ నివేదించింది. బ్రిటన్ లో కరోనా బారిన పడ్డ పెద్ద వయస్కురాలు ఈమేనని తెలిపింది.హిల్డా 1911లో జన్మించారు. 1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మందికి సోకింది. సంవత్సరం వయసున్న ఆమె సోదరిని బలితీసుకుంది. చెషైర్‌లోని క్రీవ్‌లో నివసిస్తున్నప్పుడు హిల్డా మరియు ఆమె కుటుంబంలో చాలామంది స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. ఆమె ఈ కొత్త వైరస్ గురించి భయపడ్డారని ఆమె మనువడు ఆంథోనీ చర్చిల్ తెలిపారు. చివరిసారి ఆంథోనీ తన అమ్మమ్మను సందర్శించినప్పుడు వారు కరోనా వైరస్ గురించి చాట్ చేశారు. "ఇది స్పానిష్ ఫ్లూతో సమానమైనదని ఆమె చెప్పింది. కానీ ఆ రోజుల్లో విమానాలు లేవు ఏదోలా ఇది ప్రతిచోటా వ్యాపించింది అని ఆమె అన్నారు" అని అతను చెప్పాడు.