ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఫేక్ లిక్కర్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 07:20 PM

ఏపీలో మద్యం అమ్మకాల కోసం ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ప్రవేశపెడుతోందని.. ఇది అదే అంటూ సోషల్ మీడియాలో ఓ కార్డ్ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు... లిక్కర్ కొనుగోలు చేయాలి అనుకునేవారు ముందుగా రూ.5000 చెల్లించి లిక్కర్ కార్డును పొందాలని... లిక్కర్ కార్డులోని అమౌంట్ పూర్తయ్యాక మళ్ళీ ఐదువేలు చెల్లించి కార్డు రెన్యూవల్ చేసుకోవాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ కార్డు అంత ఈజీగా రాదని... దీనికి కొన్ని కండీషన్లు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వానికి ఇలా ఆలోచన ఏదీ లేదని తేలడంతో... నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ లిక్కర్ కార్డ్ ఫేక్ అని తేలిపోయింది.


ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని ప్రకటించిన సీఎం జగన్ సర్కార్... అందులో భాగంగా వైన్స్ షాపులు, బార్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంఖ్యను కుదిస్తామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com