ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన సమయంలోనే చంద్రయాన్-2 ప్రయోగం 90 నుంచి 95 శాతం సక్సెస్ అయిందని చెప్పారని, విక్రమ్ చిరునామా గల్లంతైనా మరో మూడు శాతం కలిపి 98 శాతం సక్సెస్ అంటూ చంద్రయాన్ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ శివన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోంది. చంద్రగ్రహంపై రాత్రి వేళ మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పని చేసే విధంగా విక్రమ్ రూపొందక పోవటంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తాము సక్సస్ ఆయామని శివన్ ఎలా చెప్పుకుంటారంటూ మాజీ శాస్త్రవేత్తలు భగ్గుమన్నారు.
చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ దాదాపుగా ముగిసిందని అయినా శివన్ ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయినా ప్రయోగం విజయవంతమైందని చెప్పడం ఆక్షేపణీయమని మాజీ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. అయితే వీటిపై స్పందించేందుకు శివన్ నిరాకరించారు.