పశ్చిమ బెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో ఒక బిజెపి నేత కుమార్తెను వారి ఇంటినుంచే కొంతమంది దుండగులు తుపాకీ చూపి అపహరించారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ సింగ్ చెప్పారు. సుమారు ఐదు నెలల క్రితం టిఎంసి పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సుప్రభాత్ బత్యాబ్యల్ కుమార్తె (22)ను దుండగులు ఇంటినుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయారని ఆమె సోదరుడు చెప్పాడు. ఆ సమయంలో బత్యాబ్యల్ ఇంటి వద్ద లేరు. బత్యాబ్యల్ టిఎంసిలో చేరడానికి ముందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేశారు.