ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:21 PM

నెల్లూరు జిల్లాలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, ఆస్థులు కాపాడటంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అమరుల కుటుంబాలకు ఆర్ధిక సహాయంతో పాటు, ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.


పోలీసు శిక్షణ పొంది, చివరాఖరులో అర్హత సాధించలేని వారిని దేవాదాయశాఖలో సెక్యూరిటీ గార్డ్స్‌గా నియమించే ఆలోచన చేస్తున్నామన్నారు. స్కూళ్లు, కాలేజీలలో ఎన్‌సీసీకి ప్రాధాన్యమిచ్చేలా చూడాలని.. ఎన్‌సీసీ వల్ల దేశభక్తి పెంపొందడంతో పాటు, ఎన్నో ఉపయోగాలు, అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులను ఎన్‌సీసీ వైపు ప్రోత్సహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com