ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయిటర్​ జాబ్​ కోసం క్యూ కట్టిన వేలాది మంది భారతీయులు

international |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 02:58 PM

ఇటీవలి కాలంలో విదేశాల్లో చదువు కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే చదువు తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.ఈ నేపథ్యంలో కెనడాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ రెస్టారెంట్​లో వెయిటర్​, సర్వీస్​ స్టాఫ్​ ఉద్యోగం కోసం వేలాది మంది విద్యార్థులు క్యూ కట్టారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. కెనడాలో చదువుకోవాలని లేదా పనిచేయాలని ఆలోచిస్తున్న వారిని ఇది భయాందోళనకు గురిచేస్తోంది!


కెనడా బ్రాంప్టన్​లోని తందూరీ ఫ్లేమ్​ రెస్టారెంట్​లో ఈ ఘటన జరిగింది. క్యూలో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగమ్వీర్ సింగ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. "నేను మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడకు వచ్చాను. లైన్ చాలా పెద్దగా ఉంది. అప్లికేషన్​ని ఇంటర్నెట్​లో పెట్టాము. ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఉందని నేను నమ్మడం లేదు. ఇది చాలా కష్టం," అని అన్నాడు."ఇది చాలా తీవ్రమైన విషం; ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఎవరికీ సరైన ఉద్యోగం లభించడం లేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. వారు 2-3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు," అని క్యూలో నిలపడిన మరొక వ్యక్తి చెప్పుకొచ్చాడు.కెనడాకు వెళ్లిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారిలో చాలా మంది పరిస్థితి ఈ విధంగానే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com