ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెజవాడలో బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 09:50 PM

 


విజయవాడ - గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది.ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది.గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. సమాచారం అందుకున్న పోలీసులు తమ్ముడిని అదుపులో తీసుకొని, బిర్యానీ కోసమే చంపడా, వేరే కారణాలతో చంపడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com