సారవకోట పరిధిలోని బుడితి సబ్‌స్టేషన్ పరిధిలో గల అన్నిగ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని టెక్కలి విద్యుత్‌శాఖ ఈఈ జి.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల్లో భాగంగా అధిక లోడు ఫీడర్లను విడగొట్టడానికి 33/11 బుడితి సబ్‌స్టేషన్‌లో గల అన్ని ఫీడర్లను షట్ డౌన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటలు వరకు బుడితి, అవలింగి, చీడిపూడి, బద్రి, గుమ్మపాడు, అక్కివలస, బైదలాపురం, కిన్నెరవాడ, తొగిరి, వడ్డినవలస, గోపాలపురంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.