ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 05:27 PM

జమ్మూకశ్మీర్ సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు సోపోర్‌ పోలీసులు, 32 నేషనల్‌ రైఫిల్స్‌ సంయుక్త బృందం రఫియాబాద్‌, సోపోర్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు. హతమైన ఉగ్రవాది ఎవరనేది తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com