ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:45 PM

విజయనగరం జిల్లా, సీతానగరం మండలంలోని జోగింపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 88 ఖాళీలు ఉండడంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మధు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఐదో తరగతిలో 20 సీట్లు, ఆరో తరగతిలో 18 సీట్లు, ఏడో తరగతిలో ఒకటి, ఎనిమిదో తరగతిలో 14 సీట్లు, తొమ్మిదో తరగతిలో ఆరు సీట్లు, ఇంటర్‌లో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు కళాశాల కార్యాలయంలో వెంటనే సంప్రదించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com