ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీహరికోట షార్ కేంద్రంలో పవన్ కళ్యాణ్.. శాస్త్రవేత్తల అపురూపమైన గిఫ్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 07:43 PM

ఏపీ డిప్యూటీ సీఎం, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుపతి జిల్లా శ్రీహరికోటను సందర్శించారు. కుమార్తె ఆద్యతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ఆయనకు.. అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ (షార్)‌లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు పవన్ హాజరయ్యారు. శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షార్‌లోని రాకెట్లను పవన్ పరిశీలించారు. అనంతరం చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ తరహా మోడల్‌ను సైంటిస్టులు పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా అందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com