ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థలవివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:57 PM

తన పొలంలో మొక్కజొన్న పంటను నాశనం చేసిన విషయంలో ప్రశ్నించడంతో తనపై దౌర్జన్యంచేసి కొట్టి, చంపుతానని బెదిరించినట్లు విజయనగరం జిల్లా, రాజాం మండల పరిధిలోని పొగిరి గ్రామానికి చెందిన లోలుగు సూర్యనారాయణ అదే గ్రామానికి చెందిన లోలుగు శంకర్రావుపై గురువారం రాత్రి రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తనకు చెందిన భూమిలో పదిసెంట్లు ఆక్రమించిన విష యం ప్రశ్నిస్తే.. తనను చేతులతో కొట్టి, చంపుతానని బెదిరించినట్లు మండల పరిధిలోని పొగిరి గ్రామానికి చెందిన లోలుగు శంకర్రావు తన తల్లితో కలిసి అదే గ్రామానికి చెందిన లోలుగు సూర్యనారాయణపై గురువారం రాత్రి రాజాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఇచ్చిన పరస్పర ఫిర్యాదులపై కేసులు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజాం టౌన్‌ సి.ఐ. దాడి మోహనరావు తెలి పారు. ఈ ఘటనలు ఈనెల 2న పొగిరి గ్రామంలో జరిగినట్లు సి.ఐ. తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com