విద్య, వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పులపాలయ్యే దుస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడటం సబబు కాదన్నారు.