ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్ల పరిస్థితిపై కలెక్టర్‌ తో సమావేశమైన నల్లమిల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 03:05 PM

అనపర్తి నియోజకవర్గంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, వాటి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలెక్టర్‌ మాధవీలతను కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గంలో అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్ల పరిస్థితిని ఆమెకు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, నిర్వహణ పనులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా కెనాల్‌ రోడ్డు దుస్థితిని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చానని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com