ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 03:01 PM

రాష్ట్రంలో కూటమి విజయంలో కీలకభూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తి పట్టణంలో క్షీరాభిషేకం చేశారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎంగా పవనకళ్యాణ్‌ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక హనుమానకూడలిలో సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, కూటమి ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు రామాంజనేయులు, బాలగంగాధర్‌, గంగిశెట్టి, దాసరి శంకర్‌, చింతాదామోదర్‌, దాసరి నాగభూషణం, శ్రీనివాసులు, పాపారెడ్డి, ఉక్కలం శ్రీనివాసులు, రాము, మారుతి, కూర్మనాయుడు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com