ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన నా ప్రాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 05:12 PM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ నారా భువనేశ్వరి సైతం ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును తన ప్రాణం గానూ.. తనలో సగంగానూ భువనేశ్వరి పేర్కొన్నారు. ఆయన చేసిన తొలి సంతకం.. రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమానికి సంకేతమని అభివర్ణించారు. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు గారు చేసిన తొలి సంతకం.. రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమానికి సంకేతం. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారు’’ అని నారా భువనేశ్వరి ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com