ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 04:06 PM

మహిళా సాధికారత, మహిళల స్వావలంబన ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని గుంటూరు పశ్చి మ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. గుంటూరులోని ఒక ప్రైవేటు ఫంక్షన హాల్లో నియోజకవర్గ మహిళలు మాధవి విజయోత్సవ సంబ రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ మహిళల కు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన, డ్వాక్రా సంఘాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో మహిళా సాధికారతకు చంద్రబాబు కృషి చేశారన్నారు. చంద్రబాబు ప్రకటించిన మహాశక్తి కార్యక్రమం చరిత్రాత్మక నిర్ణయ మన్నారు. ఆయనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గుంటూరులో ఆదివారం జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అంధవిద్యార్థుల చదరంగ పోటీలకు ఆమె హాజరయ్యారు. తన ప్రసంగంతో వారిలో స్ఫూర్తిని నింపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com