ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 27, 2024, 05:38 PM

మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా గుర్తుతెలియని వ్యక్తి కారును వదిలి పారిపోయాడని మంగళగిరి సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ప్రసన్నలక్ష్మీ తెలిపారు. కారును తనిఖీ చేయగా 49.705 కిలోల గంజాయి లభించినట్టు చెప్పారు. కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com