శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం మాజీ సింగల్ విండో అధ్యక్షుడు అమ్మవారిపల్లి భాస్కర్ రెడ్డి గత మూడు సంవత్సరాల క్రితం తెదేపా పార్టీ వీడి వైసిపి పార్టీలో చేరగా బుధవారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, పరిశీలకులు నరసింహురావు సమక్షంలో టీడీపీలోకి చేరారు. అయనతో పాటు మూర్తి, ఈశ్వర్ తదితరులు పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి నరసింహ రావు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.