శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండల పరిధి డి కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ విఆర్ఓ ఓబుల రెడ్డి ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి బుధవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒక డాక్టర్ గా తగు సూచనలు సలహాలు అందజేశారు.