ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు చప్పట్లు కొట్టించుకోవడానికి ఇక్కడికి రాలేదు...మీ కోసం మేం అందరం నిలబడడానికి వచ్చాం : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 09:06 PM

పార్టీలు కలిసుండాలి అని, లేకుంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని 2014 నుంచి చెబుతున్నాం. పోలవరం అయిపోయిందా అని ప్రశ్నిస్తే ఓలమ్మి తిక్కరేగిందా, ఓలమ్మి తిమ్మిరెక్కింద అంటూ నీటిపారుదల శాఖ మంత్రి డ్యాన్స్ చేస్తున్నారు. అలాంటి పాటలకు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేవాడు. పోలవరం పునరావాసం గురించి చెప్పమంటే... అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ మరో పాట ఎత్తుకుంటాడు. బూతులు తిట్టేవాళ్లు, డ్యాన్సులు చేసేవాళ్లు, దాడులు చేసేవాళ్లు వైసీపీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఈరోజు చప్పట్లు కొట్టించుకోవడానికి ఇక్కడికి రాలేదు... మీ కోసం మేం ఉన్నాం అని చెప్పేందుకు వచ్చాం...మీ కోసం మేమెంతో తగ్గాం. చంద్రబాబు గారు ఎంతో తగ్గారు.. నేను కూడా తగ్గాను. ముఖ్యంగా జనసేన పార్టీ ఎంతో తగ్గింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com