ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో నేవీ డే వేడుక‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 01:37 PM

విశాఖలోని తూర్పు నౌకా­దళ ప్రధాన కేంద్రంలో ఇవాళ నేవీ డే వేడుక‌లను నిర్వ‌హించనున్నారు. ఈ ఉత్స‌వాలకు ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ హాజరు­కానున్నారు. కాగా, భార‌త్‌-పాక్ మధ్య జరి­గిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వ­హిస్తారు. ఈ ఏడాది మిచాంగ్‌ తుపాను కారణంగా 4న జరగా­ల్సిన వేడు­కల­ను 10వ తేదీకి వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com