ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్లలో నకిలీ టీసీలు.. అసలు టీసికి ఎదురుపడి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 01:09 PM

చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు నకిలీ టీసీలుగా అవతారం ఎత్తారు. ఈ ముగ్గురు గత కొద్ది రోజులుగా టీసీల యూనిఫామ్ ధరించి రైళ్లలో టికెట్లను తనిఖీ చేస్తున్నారు. టికెట్ లేనివారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
కాగా మంగళవారం చీరాల రైల్వే టీసీ రాజేశ్‌కు నిందితులు ఎదురుపడగా జీఆర్‌పీ పోలీసులకు చెప్పారు. దీంతో జీఆర్పీ పోలీసులు నిందితులను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండయ్య వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com