గాజువాక జీవీఎంసీ పరిధి 76వ వార్డులో రాష్ట్ర ప్రజలకు విలువైన సేవలను అందిస్తున్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోందని జీవీఎంసీ 76వ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ శనివారం తెలిపారు. 76వ వార్డు పరిధి హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇంఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు.