ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస వివాదాల్లో ఇరుక్కుంటోన్న డొనాల్డ్ ట్రంప్,,,96లో ట్రంప్ అత్యాచారం చేసినట్టు తాజాగా కాలమిస్ట్ ఆరోపణ

international |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:21 PM

త్వరలో జరిగే 2024 ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుస ఒకదాని తర్వాత మరో కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, 1996లో ట్రంప్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ అమెరికన్‌ జర్నలిస్ట్, మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌ (79) ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మన్‌హట్టన్‌లోని యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో ఈ సివిల్‌ వివాదానికి సంబంధించిన విచారణ మొదలైంది. ‘డొనాల్డ్ ట్రంప్ నాపై అత్యాచారానికి పాల్పడటంతో నేను ఇక్కడ ఉన్నాను.. దాని గురించి పుస్తకంలో రాస్తే అది జరగలేదని చెప్పాడు’ అని కోర్టులో కారొల్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడు నా ప్రతిష్టను నాశనం చేశాడు.. నేను నా జీవితాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.


కారొల్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. ‘1996లో మన్‌హట్టన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో కారొల్‌కు ట్రంప్‌ ఎదురయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను కానుకగా ఇచ్చేందుకు తనను సలహా అడిగారు.. ట్రంప్‌ సరదాగా అడగడంతో అంగీకరించి ఆమె డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఆరో ఫ్లోర్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ సెక్షన్‌లో ఎవరూ లేరు.. దుస్తులు మార్చుకునే గదిలోకి వచ్చిన ట్రంప్‌.. తలుపు మూసి గోడవైపు గట్టిగా నెట్టాడు.. ఆమె తల కొట్టినంత గట్టిగా తోశాడు. చాలా గందరగోళానికి గురయ్యారు.. తానును అనుకున్నది జరగడం లేదని అకస్మాత్తుగా గ్రహించారు.. లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఆ ఘటనతో షాక్‌కు గురైన కారొల్‌ అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.


రెండు దశాబ్దాల కిందట ఈ ఘటనపై ముగ్గురు మహిళలతో కూడిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ సాగిస్తోంది. ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతేడాది కారొల్ తన పుస్తకంలో ఆరోపించారు. అయితే, కేవలం పుస్తకం అమ్మకం కోసమే కల్పితాలు సృష్టించారని ఆరోపిస్తూ ట్రంప్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, విస్తృత రాజకీయ ప్రేరేపిత కుట్రలో ఇది భాగమని వాదించాడు. ట్రంప్ పట్ల ద్వేషపూరితంగా కారొల్ కట్టుకధలు చెబుతున్నారని తెలిపారు. లైంగిక దాడే నిజమైతే ఇన్నేళ్లు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఇదిలావుంటే పోర్న్‌స్టార్‌తో తనకు శారీరక సంబంధం బయటపడకుండా ఉండేందుకు 2016 ఎన్నికల సమయంలో ఆమెతో ట్రంప్ అనైతిక ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయన లొంగిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com