చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఓ యువతి(20)ని మోసం చేసిన చిత్తూరు మండలం పెరుమాళ్ళకండ్రిగకు చెందిన నరేశ్ (31)పై కేసు నమోదుచేసినట్లు సీఐ నరసింహారెడ్డి గురువారం తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఏడాదిగా సహజీవనం చేశాడన్నారు తనను పెళ్ళిచేసుకోవాలని ఆమె నిలదీయగా, నిరాకరించాడన్నారు. ఆమె గురువారం ఫిర్యాదు చేయగా నరేశ్‌పై కేసు నమోదు చేశామన్నారు.