ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభ్యత్వ నమోదులో నియోజకవర్గం అగ్రగామిగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 03:03 PM

త్వరలో ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదులో అనపర్తిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయు డు మనోజ్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు.


ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఎన్‌ఆర్‌ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జి లంతా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని కోరారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌రెడ్డికి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినం దనలు తెలిపారు. కార్యక్రమంలో సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, జుత్తుగ కృష్ణ, కొవ్వూరి వెణేగోపాలరెడ్డి, వెలుగుబంటి సత్తిబాబు, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com