ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 03:01 PM

నిడదవోలు పట్టణంలోనున్న బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాకోళపు లక్ష్మీ నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు లక్ష బిల్వా ర్చన, అమ్మవారికి కుంకుమ పూజలు, సహస్ర నామార్చన నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సోమాల శివ వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com