అంగన్వాడీ సూపర్వైజర్ ల నియామకంలో, అధికార పార్టీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, బాధితుల తరపున తమ స్వరాన్ని వినిపించి, భవిష్యత్ లో ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు అంగన్వాడీ సూపర్ వైజర్ అక్రమ నియామకాల నిలిపివేతకై పోరాడిన తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంఘానికి అభినందనలు అని నారా లోకేష్ తెలియజేసారు. భవిష్యత్ లో కూడా అంగన్వాడీ ల సమస్యలపై మీరు నిరంతరం పోరాడుతారనీ, బాధితులకు టీడీపీ తరపున అండగా ఉంటారని ఆశిస్తున్నాను అని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఐతే అలానే ప్రభుత్వం కూడా అంగన్వాడీ సూపర్వైజర్ ల నియామకం కోసం నోటిఫికెషన్స్ ఇచ్చి మరల రద్దు చేస్తున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే.