విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో రూరల్ సిఐ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది అక్టోబరు 2న విటి అగ్రహారం ఎస్.క్యూబ్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ వెనుక గల బహిరంగ స్థలంలో మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేసి, 376 IMFL బాటిళ్లు ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి కేసు నమోదు చేసి కోర్ట్ కి హాజరు పెడతామని తెలియజేసారు. సమాజంలో అక్రమాలకు పాల్పడితే చట్టం ద్వారా కఠిన శిక్షలకి పాల్పడుతారు అని ఈ సందర్భంగా హెచ్చరించారు.