నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టాపన చేసిన వినాయకుడిని సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.