ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పి యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పి కార్యాలయంలో బ్లూ కోర్ట్స్ పోలీసులకు హెల్మెట్లను అందించారు. సెప్టెంబర్ ఒకటి నుండి జిల్లా పరిదిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం బరువు అనుకోకుండా బాధ్యతగా భావించాలని చెప్పారు.