భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో సోమవారం ఎడ్ల కట్ట వాగు సమీపంలో ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. గ్రామం నుండి మండల కేంద్రానికి వస్తున్న లారీ ఎడ్ల కట్ట వాగు వద్ద ఉన్నటువంటి మలుపు వద్ద రోడ్డు కిందికి దిగింది. దీంతో రోడ్డు కింద లారీ పడగా అందులో ఉన్న లారీ డ్రైవర్ క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.