అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 100కు పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. 200 మందికి పైగా యోగ శిక్షకులు, కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో 60 వేల మందికి పైగా యోగ సాధకులు, ఔత్సాహికులు పాల్గొని.. యోగాపైనే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై ఉన్న మక్కువను చాటిచెప్పారు. ప్రత్యేకించి తెలంగాణ పోలీసు అకాడమీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు యూనిట్లు, మూడు జిల్లాలలో ఉన్న 11 తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లలో, కేంద్ర రిజర్వు బలగాల 3 యూనిట్లలో యోగా కార్యక్రమాలు జరపడం విశేషం.