బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.