వేల్పూర్ కు చెందిన కుండల కిషన్ స్కూటీలో నుంచి లక్ష రూపాయలు గుర్తుతెలియని దుండగులు శుక్రవారం ఎత్తుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సీసీ ఫుటేజీ పరిశీలించి ఇద్దరు అనుమానితుల ఫోటోలను గుర్తించినట్లు తెలిపారు. నలుపు రంగు హోండా షెన్ ద్విచక్రవాహనంపై తిరిగినట్లు, వారు ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ తెలపాలని ఎస్సై వినయ్ కుమార్ అన్నారు.