టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ తప్పుడు పద్ధతిలో ప్రభుత్వం ఆయన్నిఅరెస్టు చేసిందన్నారు. చంద్రబాబును చూసి జగన్ భయపడుతున్నాడని..రాబోవు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందన్నారు. చంద్రబాబుపై అన్యాయంగా పెట్టిన కేసు కోర్టులో నిలవదని దానిని కోర్టు కొట్టి వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.