జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాకు చెందిన భూక్యా తిరుపతిపై ఖమ్మం వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు చోరీ కేసులు నమోదయ్యాయి. గతంలో జైలుశిక్ష అనుభవించినా తనలో మార్పు రాలేదు. మళ్లీ చోరీకి పాల్పడుతుండడంతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు