జిల్లాలోని రేషన్ కార్డు దారులు ఈకేవైసీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ సూచించారు. డీలర్ల సంఘం బాధ్యులతో శనివారం ఖమ్మం కలెక్టరేట్ లో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి జి. శ్రీలత, డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకన్న, జానీమియా పాల్గొన్నారు.