ఖమ్మం మెడికల్ కళాశాల ఆర్ఎంఓగా సివిల్ సర్జన్ డాక్టర్ కోటాచలం నియమితులయ్యారు. ఈమేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూర్యాపేట డీఎంహెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను వెంటనే ఆర్ఎంఓగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావును మరికొంత కాలం కొనసాగించనున్నారు.